23-12-2025 02:16:31 AM
అట్టహాసంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణస్వీకార మహోత్సవం
ఎమ్మెల్యే, ఎంపీలు హాజరు
రంగారెడ్డి, డిసెంబర్ 22(విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా పల్లెల్లో సోమవారం పండగ వాతావరణం నెలకొంది. కొత్తగా సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు గా గెలిచిన వారు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆఫీసులను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్త పాలక మండలికి ఎన్నికై పదవీ బా ధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా గ్రామాల్లో వేద పండితులు వారికి ఆశీర్వాచనాలు అం దజేశారు. గ్రామ పెద్దలతో పాటు పలు చోట్ల ఎమ్మెల్యేలు, ఎంపీ లు కూడా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలకు హాజరయ్యారు. ఆయా గ్రామాలకు కేటాయించిన ప్రత్యేక అధికారులు సర్పంచ్ తో పాటు పాలక మండలి సభ్యులను ప్రమాణ స్వీకార కార్యక్రమాలను నిర్వహించారు.
బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సర్పంచుల అభిమానులు గ్రామాల్లో పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. వచ్చే ఐదేండ్లలో గ్రామాభివృద్ధికి పాటు పడుతామని ప్రమాణ స్వీకారం సందర్భంగా హామీ ఇచ్చారు. జిల్లాలో మొత్తం525 గ్రామ పంచాయ తీలకు మూడు విడుతల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 11న మొదటి విడుత, 14న రెండో విడుత, 17న మూడో విడుతలో ఎన్నికలు జరగ్గా.. మూడు దశల్లోనూ పోలింగ్ జరిగిన రోజు మధ్యాహ్నం తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి గెలిచిన అభ్యర్థులకు రిటర్నింగ్ అధికా రులు ధృవీకరణ పత్రాలు అందజేశారు. వార్డు సభ్యులుగా గెలుపొందిన వారు ఉప సర్పంచిని ఎన్నుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు దశల పోలింగ్‌పూర్తున తర్వాత ఈ నెల 20న కొత్త పాలక మండళ్లకు ఎన్నికైన వారితో ఒకే రోజున ప్రమాణ స్వీకారం చేయించాలని భావించినప్ప టికీ ముహూర్త బలం కారణంగా ఆ కార్యక్రామ న్ని సోమవారం కు మార్చారు.
కొలువుదీరిన పాలకవర్గాలు
అబ్దుల్లాపూర్ మెట్, డిసెంబర్ 22: అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని పలు గ్రామ పంచాయతీల పాలకవర్గాలు సోమవారం అట్టహాసంగా కొలువు తీరాయి. ఆయా గ్రామ పంచాయతీల సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లు ప్రత్యేక అధికారుల సమక్షంలో ప్రమాణ స్వీకారాలు చేశారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు పంచాయతీ కార్యదర్శులతో కలిసి ప్రత్యేక అధికారులు పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామ పంచాయతీలలో సభలు నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజలు తమ గ్రామాల్లోని సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని పలువురు ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. సమిష్టి భాగస్వామ్యంతో ప్రజలు, అధికారుల సమన్వయంతో గ్రామ ప్రగతికి బాటలు వేస్తామని తెలిపారు. పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని నూతన ప్రజాప్రతినిధులు కోరారు. వార్డుల్లో ఏ సమస్య వచ్చినా ప్రజలు వార్డు మెంబర్ గాని, తమ దృష్టికి గాని తీసుకొస్తే తక్షణ పరిష్కారానికి కృషి చేస్తామని ఆయా గ్రామాల సర్పంచులు అన్నారు. గ్రామాభివృద్ధికి అధిక నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని ఉత్తమ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దేందుకు తమ పాలకవర్గం పాటుపడుతుందని ఉన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఏ నమ్మకంతో అయితే తమకు ఓటు వేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఐదేళ్లపాటు ప్రజా సేవకుడిగా పనిచేస్తామని సర్పంచులు హామీ ఇచ్చారు. ప్రజల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిపరిచి సమస్యలు లేని గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఎన్నికల అప్పుడే రాజకీయాలు చేయాలి తప్ప గెలిచాక ప్రజాప్రతినిధులు గ్రామ అభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రత్యేక అధికారులు నూతన పాలక వర్గాలకు సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ గ్రామ ప్రగతికి బాటలు వేసేలా గ్రామ పాలకవర్గాల తీర్మానాలు చేయాలని వారు పేర్కొన్నారు. కలసి పనిచేస్తే ఏదైనా సాధ్యమవుతుందని ఎలాంటి విభేదాలకు తావు ఇవ్వకుండా సమిష్టి భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీవో శ్రీవాణి, ఎంపీఓ మధుసూదనాచారి, తహసిల్దార్ సుదర్శన్ రెడ్డి, ఎంఈఓలు శ్రీనివాసులు, జగదీష్ , ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ప్రజలు పాల్గొన్నారు.