21-12-2025 12:00:00 AM
హైదరాబాద్, డిసెంబర్ 20 (విజయక్రాంతి): తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారుల సంఘం హైదరాబాద్ జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో శనివారం నాంపల్లిలోని యూనిట్ కార్యాలయ ప్రాంగణంలో క్రిస్మస్ వేడుకల ను వైభవంగా నిర్వహించారు. టీఎన్జీవో కేం ద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌ఎం హుస్సేనీ (ముజీబ్) ముఖ్య అతిథులుగా హాజరయ్యా రు. ఈ వేడుకల్లో భాగంగా డాక్టర్ ఎస్‌ఎం హుస్సేనీ డాన్ బాస్కో అనాథాశ్రమానికి చెందిన పిల్లలకు తన సొంత ఖర్చులతో నూ తన వస్త్రాలను, నిత్యావసర సరుకులను పం పిణీ చేశారు. మారం జగదీశ్వర్ మాట్లాడు తూ.. ‘క్రీస్తు జన్మదినం మానవాళికి ప్రే మ, త్యాగం మరియు శాంతిని బోధిస్తుంది’ అ న్నారు.
టీఎన్జీవో కుటుంబం కేవలం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికే కాకుం డా, సమాజంలోని నిరుపేదలకు అండగా నిలవడంలోనూ ముందుంటుందని చెప్పా రు. డాక్టర్ ఎస్‌ఎం హుస్సేనీ మాట్లాడుతూ.. ‘పండుగ అంటే కేవలం వేడుక మాత్రమే కాదు, తోటివారికి సాయం చేయడంలోనే అసలైన సంతోషం ఉంది’ అన్నారకు. డాన్ బాస్కో అనాథాశ్రమ పిల్లల ముఖాల్లో చిరునవ్వు నింపడం మాకు ఎంతో తృప్తినిచ్చింద న్నారు. విక్రమ్ కుమార్ (హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు) మాట్లాడుతూ.. ‘మన జిల్లా కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలను ఇంత ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉం ది. వేడుకలకు విచ్చేసిన కేంద్ర సంఘం పెద్దలకు ధన్యవాదాలు’ అన్నారు జిల్లా కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్, అసోసియేట్ ప్రెసిడెంట్ కె.ఆర్. రాజుకుమార్, నా యకులు ముకీమ్ ఖురేషి, ఇతర జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రభుత్వ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.