calender_icon.png 23 December, 2025 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ఉత్తమ ఉద్యోగులు

23-12-2025 12:33:43 AM

ఇల్లెందు, డిసెంబర్ 22, (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియా నుంచి అత్యుత్తమ ప్రతిభ కనపరచిన ఉత్తమ ఉద్యోగు లుగా ఎంపికైన వారిని సోమవారం జియం కార్యాలయంలో ఏరియా జియం వీసం కృష్ణయ్య ప్రకటించారు. ఈ సందర్బంగా జియం వీసం కృష్ణయ్య మాట్లాడుతూ.. ఇల్లందు ఏరియా అధికారులకు, ఉద్యోగుల కు, యూనియన్ ప్రతినిధులకు సింగరేణి ది నోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్బంగా సింగరేణి ఇల్లందు ఏరియా నుంచి కోయగూడెం, జెకె ఒసిలలో విధుల నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభను కనపరచిన అధి కారులు, ఉద్యోగులుగా ఏరియా హాస్పిటల్ నుంచి మెడికల్ సూపరింటెండెంట్ శారద దేవి, జెకె ఓపెన్ కాస్ట్ నుంచి సీనియర్ సర్వే అధికారి బానోత్ నాగేశ్వర రావు, యాస లక్ష్మి నర్సయ్య, సీనియర్ అస్సిసెంట్, కోయగూడెం ఓపెన్ కాస్ట్ నుంచి గుగులోత్ రాజ్ కుమార్, జూనియర్ అస్సిసెంట్ ఎంపికైన ట్లు గా జియం ప్రకటించారు. వీరిని సింగరేణి దినోత్సవం రోజు సన్మానించడం జరుగుతుందని తెలిపారు.