calender_icon.png 7 May, 2025 | 5:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్‌లను రద్దు చేయండి

07-05-2025 12:42:27 AM

యాచారం, మే 6: కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ అన్నారు. కా ర్మిక ప్రజా వ్యతిరేక విధానాలు  ఉపసంహరిoచుకోవాలని, ఈనెల 20న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె ను జయప్రదం చే యాలని అన్నారు.

కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను  కార్పొరేట్ అనుకూల మతోన్మాద చర్యలను మరింత దూకుడు అమలు చేస్తుందని అన్నారు. కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా 100 సంవత్సరాలు సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి, వాట్ ఇన్ స్థానంలో 4 లేబర్ కోడ్ లను ముందుకు తీసుకొచ్చిందని అన్నారు.

2025-26 బడ్జెట్లో తమ కార్పొరేట్ అనుకూల విధానాలకు అనుకూలంగా కేటాయిం పులు చేసిందన్నారు. సామాజిక సంక్షేమానికి కోతలు పెట్టింది అన్నారు. ఈ నేపథ్యం లో 2025 మే 20న దేశ వ్యాప్త సార్వత్రిక స మ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని జ యప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షు లు వై స్వప్న, పెండ్యాల బ్రహ్మయ్య, సిఐటియు మండల కన్వీనర్ చందు నాయక్ తదితరులు పాల్గొన్నారు.