calender_icon.png 20 July, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేశంపేట పొలీస్ స్టేష‌న్‌లో మజ్లీస్ ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్

10-08-2024 04:21:26 PM

హైదరాబాద్ నగరంలోని బహదూర్ పురా ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ ను కేశంపేట పొలీస్ స్టేషన్ కు తరలించారు. ఇటీవలే ఓ ప్రార్థనా మందిరం సమీపంలో రోడ్డు పనుల పెండింగ్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తు ఆయన జీహెచ్ఎంసి సిబ్బందిపై బూతు పురాణంతో రెచ్చి పోయిన సంగతి విదితమే. తాజాగా రోడ్డు విస్తరణ పనులను పురస్కరించుకుని ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా నగర పోలిసులు ఎమ్మెల్యే ముబీన్ ను అదుపులోనికి తీసుకున్నారు. ఈ సంధర్బంగా రంగారెడ్ది జిల్లా లొని కేశంపేట మండల పొలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సమాచారం తెలుసుకున్న స్థానిక మీడియా ప్రతినిధులు అక్కడికి ఎమ్మెల్యే ను కలుసుకోవడానికి పోలిసులు నిరాకరించారు. పై అధికారుల ఆదేశాల మేరకు ఎలాంటి ఫోటోలు తీసుకోరాదని హైదరాబాద్ పోలీసులు మీడియాకు తెలిపినట్లు సమాచారం.