calender_icon.png 12 September, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీ శ్రమతోనే పరిశుభ్రత సాధ్యమవుతుంది

12-09-2025 12:22:00 AM

మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): మీ శ్రమతోనే నగరం అంత పరిశుభ్రంగా ఉందని మహబూబ్ నగర్ ఎ మ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గు రువారం నగరం లోని శిల్పారామం లో మ హబూబ్ నగర్ కార్పోరేషన్ లో పనిచేస్తున్న 400 మంది పారిశుద్ధ్య కార్మికులకు పిపిఈ కిట్లు, యూనిఫాం లను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తో కలిసి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ తంలో మహబూబ్ నగర్ మున్సిపాలిటీ గా ఉండేదని, ఇప్పుడు కార్పోరేషన్ గా అభివృ ద్ధి చెందిందని మనందరిపైన బాధ్యత మ రింత పెరిగిందన్నారు. మీ సమస్యలను పరిష్కరిస్తామని, మీ అందరికి కూడా ఆరోగ్య భీ మా గురించి అధికారులతో మాట్లాడి వెంట నే తగు చర్యలు తీసుకుంటామన్నారు.  అంతకుముందు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మాట్లాడుతూ మీరు పట్టణంలోని ప్రతి కాలనీలను శుభ్రం చేయడం వల్లనే మ హబూబ్ నగర్ నగరం అంతాకూడా పరిశుభ్రంగా ఉందన్నారు.

మహబూబ్ నగర్ ప్రజ ల ఆరోగ్యం కాపాడడం లో పారిశుధ్య కార్మికుల కీలక పాత్ర అని అన్నారు.చెత్త,నీరు ని లువ ఉండడం వలన దోమల ద్వారా డెం గ్యూ,జ్వరాలు ప్రబలుతాయని అన్నారు. పారిశుధ్య కార్మికులు నగరం ను పరిశుభ్రంగా ఉంచడం లో, ప్రజల ఆరోగ్య రక్షణ లో గొప్ప పాత్ర అని కొనియాడారు. కార్పోరేషన్ గా మారిన నగరం ను పచ్చద నం,

పరిశుభ్రత లో మొదటి గా ఉండేలా అం దరం కలిసికట్టుగా కృషి చేయాలని అన్నా రు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మూడ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కె రి అనిత మధుసూదన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.