12-09-2025 12:21:55 AM
ప్రారంభించిన ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి
నారాయణఖేడ్, సెప్టెంబర్ 11: జిల్లాస్థాయి 69వ ఎస్ జి ఎఫ్ క్రీడా పోటీలను గురువారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పి.సంజీవరెడ్డి ప్రారంభించారు. క్రీడా పోటీల సందర్భంగా జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన క్రీడాకారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి క్రీడాజ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మారుమూల ప్రాంతమైన నారాయణఖేడ్లో జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం ఎంతో గర్వకారణమని అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా నారాయణఖేడ్ లో ఇలాంటి పోటీలను నిర్వహించేందుకు తాను ప్రత్యేక చొరవ చూపడం జరిగిందన్నారు.
విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. త్వరలోనే నారాయణఖేడ్ కు ఇండోర్, ఔట్ డోర్ స్టేడియాలను ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేయడం జరుగుతుందని, త్వరలోనే మంజూరు సైతం అవుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి,సంగారెడ్డి జిల్లా ఎస్ జి ఎఫ్ ఇన్చార్జి శ్రీనివాస్, ఆయా మండలాల పిఈటిలు కాంగ్రెస్ పార్టీ నాయకులు వినోద్ పాటిల్, తాహెర్‌అలీ, రమేష్ చౌహన్, షారుక్ ఖాన్ , పవన్, కిషన్ నాయక్, వెంకట్ నాయక్, జైపాల్ ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, యువకులు, నాయకులు క్రీడాకారులు పాల్గొన్నారు.