calender_icon.png 12 September, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హుస్నాబాద్‌ను అభివృద్ధి కేంద్రంగా మారుస్తాం

12-09-2025 12:23:23 AM

- మంత్రి పొన్నం ప్రభాకర్

- రూ.10కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

 -హుస్నాబాద్ లో నిజాం కాలంనాటి ఆల్బియన్ బస్సు ప్రారంభం

హుస్నాబాద్, సెప్టెంబరు 11 : హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రకాల అభి వృద్ధి కార్యక్రమాలకు కేంద్రంగా మారుస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొ న్నం ప్రభాకర్ అన్నారు. పర్యాటకం, విద్య, పరిశ్రమలు, వ్యవసాయం, ఉద్యోగ కల్పనకు అవసరమైన మౌలిక సదుపాయాలను మె రుగుపరచడంపై తమ ప్రభుత్వం దృష్టి పె ట్టిందన్నారు.

గురువారం ఆయన హుస్నాబాద్, కోహెడ మండలాల్లో దాదాపు రూ.10 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హుస్నాబాద్ లో 1930 నాటి నిజాం కాలం ’ఆల్బియన్ బ స్సు’ను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆ యన మాట్లాడుతూ నాలుగు జిల్లాలైన కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ, జనగామ మధ్యలో ఉన్న హుస్నాబాద్ను ఒక ముఖ్యమైన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్ర యత్నాలు జరుగుతున్నాయన్నారు.

ఇప్పటికే ఈ ప్రాంతంలో శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ, గౌరవెల్లి ప్రాజెక్టుతోపా టు ఇండస్ట్రియల్ పార్కు కూడా రాబోతోందన్నారు. పర్యాటక రంగ అభివృద్ధి కోసం మహాసముద్రం గండి టూరిజం ప్రాజెక్టు, సర్దార్ సర్వాయి పాపన్న నిర్మించిన ఎల్లమ్మ గుడి, పొట్లపల్లి శివాలయం వంటి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు ఒక సమగ్ర కార్యాచరణ రూపొం దించామని వివరించారు.

ఈ ప్రణాళికలో భాగంగానే హుస్నాబాద్ పట్టణంలో రూ. 3 కోట్లతో సెంట్రల్ లైటింగ్, ప్లాంటేషన్, జంక్షన్ అభివృద్ధి పనులకు, రూ. 2 కోట్లతో పల్లెచెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామన్నారు. కోహెడ మండలం నారాయణపూర్, కాచాపూర్ గ్రామాలలో నిర్మించ నున్న హైలెవల్ వంతెనల నిర్మాణాలు గ్రామస్తుల చిరకాల స్వప్నమని, వాటిని వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ ప్రాంతం అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనులు ముందుకు సా గుతాయని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ హైమవతి, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తదితరులు పాల్గొన్నారు.