23-10-2025 10:27:40 PM
అత్యధికంగా కోయిలకొండ షాప్ నెం.2కు 50
అత్యల్పంగా మక్తల్ షాప్ నెంబర్ టు కు 17వ దరఖాస్తు షాపులకు వచ్చిన దరఖాస్తులు
జిల్లాలకు 2487 దరఖాస్తుల రాక
కోయిలకొండ: మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలకు సంబంధించి ఉన్న 112 మద్యం షాపులకు గాను ఎక్సైజ్ శాఖ టెండర్ ప్రక్రియ నిర్వహించేందుకు దరఖాస్తులను ఇటీవల స్వీకరించింది. ఈ దరఖాస్తుల ప్రక్రియ గురువారంతో ముగియడంతో 112 షాపులకు 2487 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా కోయిలకొండ మండలంలోని మద్యం షాప్ నెంబర్ రెండుకు 50 దరఖాస్తులు రాగా అత్యల్పంగా నారాయణపేట జిల్లాలోని మక్తల్ పరిధిలోని షాపుకు షాపు నెంబర్ 2కు 17 దరఖాస్తులు వచ్చాయి. తదుపరి ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎక్సైజ్ సూపర్డెంట్ సుధాకర్ తెలియజేశారు. తక్కువ వచ్చిన షాపులకు మరో మరు దరఖాస్తులు స్వీకరిస్తారా లేదా అని అంశం కూడా ఉంటుందా అని దరఖాస్తుదారులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుండా తీసుకోవడం తెలియాల్సి ఉంది.