calender_icon.png 22 August, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్లస్టర్ అభివృద్ధి మా అందరి లక్ష్యం

22-08-2025 01:01:06 AM

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి తారను కలిసిన ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ ఆగస్టు 21 (విజయ క్రాంతి) : మహబూబ్ నగర్ క్లస్టర్ అభివృద్ధికి సహకారం అందించాలని ఎంపీ డీకే అరుణ, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి తార ను కోరారు . రాష్ట్ర ప్రభుత్వం క్లస్టర్ అభివృద్ధికి సంబంధించిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించిన నేపధ్యంలో,  పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి తార ని డిల్లీ లోని వారి కార్యాలయంలో మహబూబ్ నగర్ క్లస్టర్ (మహబూబ్ నగర్, బూత్పూర్, జడ్చర్ల) తో పాటు పార్లమెంటు పరిధిలో ఉన్న మున్సిపాలిటీల అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో అభివృద్ధికి నోచుకోక పోవడంతో మహబూబ్ నగర్ అంటేనే వెనుకబడిన జిల్లాగా, వలసల జిల్లాగా, లేబర్ జిల్లాగా పేరుగాంచిందన్నారు. మహబూబ్ నగర్ క్లస్టర్ లోని మూడు పట్టణాలు అభివృద్ధి చెందితే యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, విరివిరిగా అనేక కంపెనీలు వస్తాయని ఆయన చెప్పారు.  రాష్ట్ర ప్రభుత్వం క్లస్టర్ అభివృద్ధికి సంబంధించిన నివేదిక పంపించిందన్నారు.

కాబట్టి, ముందుగా మహబూబ్ నగర్ క్లస్టర్ కు ప్రాధాన్యత ఇచ్చి , ఎంపిక చేయాలని ఎమ్మెల్యే ఆమెను కోరారు. మహబూబ్ నగర్ క్లస్టర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని పట్టణాలని మహబూబ్ నగర్ క్లస్టర్ అభివృద్ధి చెందితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.