09-01-2026 12:05:14 AM
జైనూర్, జనవరి 8(విజయక్రాంతి): జైనూర్ మండలంలోని మార్లవాయి గ్రామ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.91 లక్షల నిధులకు కృతజ్ఞతగా సర్పంచ్ కనక ప్రతిభ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క చిత్రపటాలతో కూడిన ఫ్లెక్సీకి గ్రామస్తులతో కలసి క్షీరాభిషేకం చేశారు.
ఈ నిధులతో ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్‌బెట్టి ఎలిజబెత్ల కాంస్య విగ్రహాల ప్రతిష్టాపనతో పాటు స్మృతి వనం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీంతో గ్రామానికి చారిత్రక ప్రాధాన్యత పెరుగుతుందని గ్రామస్తులు పేర్కొన్నారు. దశాబ్దాల నిర్లక్ష్యానికి ముగింపు పలికిన ఈ నిధులు గ్రామ అభివృద్ధికి కొత్త దిశ చూపనున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపటేల్ ఆత్రం భగవంత్ రావు, ఉపసర్పంచ్ ఆత్రం రాజేశ్వర్, వార్డు సభ్యులు సోయం రాజు, పార్వతి, గణపత్, సీత, భరత్, రాము, మరు శ్రీకాంత్, సోనేరావు పాల్గొన్నారు.