03-12-2024 05:28:16 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్ లో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ మార్గ్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల్లో హెచ్‌సీఐటీఐ కార్యక్రమం కింద ఎంఏ అండ్ యూడీ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే దానం నాగేందర్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. సభ వేదిక వద్దకు వస్తూ అక్కడ ఏర్పాటు స్టాల్స్ ను సందర్శించి అందులోని వారిని పలుకరించారు. పారిశుద్ధ్య కార్మికులకు భద్రత కిట్లను పంపిణీ చేశారు.
రూ.3500 కోట్ల వ్యయంతో రహదారి అభివృద్ధి పనులు, రూ.16.50 కోట్లతో భూగర్భ సంపులను నిర్మిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో రూ.150 కోట్లతో పలు సుందరీకరణ పనులు ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి దేశంలోనే అతిపెద్దఎస్టీపీ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. రెండో అతి పొడవైన ఆరాంఘర్- జూపార్క్ ప్లైఓవర్ ను, కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టబోయే 6 జంక్షన్ల అభివృద్ధికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అలాగే 7 ప్లైఓవర్లు, అండర్ పాసులకు శంకుస్థాపన చేయనున్నారు.