08-08-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ తేజస్ నందనాల పవర్
తుంగతుర్తి, ఆగస్టు 7 : ప్రభుత్వ దావాఖానకు వచ్చిన రోగులకు డాక్టర్లు ,సిబ్బంది అంకితభావంతో పనిచేసినప్పుడే గుర్తింపు లభిస్తుందని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డును పరిశీలించారు. ఎక్స్రే మిషన్, డెంటల్, ల్యాబ్ లను పరిశీలించి రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
నూతనంగా నిర్మిస్తున్న ఏరియా దవాఖానను పరిశీలించారు. దవాఖానాలో చిన్న, చిన్న సమస్యలు ఉన్నట్లయితే తక్షణమే పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం తుంగతుర్తి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంను సందర్శించి, విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తుంగతుర్తి ఎస్సీ కాలనీలోని దళిత కుటుంబం తడకమళ్ళ వెంకన్న ఈ మధ్యకాలంలోనే అనారోగ్యంతో మృతిచెందగా, గతంలో తల్లి క్యాన్సర్ వ్యాధితో మృతి చెందింది.
దీనితో ఇరువురు బిడ్డలు అనాధ అయ్యారు. వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కట్టుకుంటే ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని అన్నారు. గ్రామపంచాయతీలో నెలకొలనుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేసి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ దయానంద్ ఎంపీడీవో శేషు కుమార్ ప్రభుత్వ దవాఖాన సూపరిండెంట్ డాక్టర్ నిర్మల్ కుమార్, డాక్టర్ వీణ, డాక్టర్ రాజు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.