16-07-2025 01:53:07 PM
హైదరాబాద్: సీనియర్ ఫోటో జర్నలిస్టు షేక్ నసీరుద్దీన్(Journalist Sheikh Nasiruddin) మరణించారని తెలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వివిధ మీడియా సంస్థలతో పాటు మున్సిఫ్ పత్రికలో పనిచేసిన నసీర్, దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఫోటో జర్నలిజంలో తనదైన గుర్తింపును తెచ్చుకున్నారని, వారి మరణం పాత్రికేయ రంగానికి తీరని లోటు అని ఒక సందేశంలో పేర్కొన్నారు. నసీర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సంతాపం, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.