24-08-2025 01:16:35 AM
చదువుకు పేదరికం అడ్డుకాదని మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలా నికి చెందిన తప్పెట్ల నరేందర్ మరోసారి నిరూపించాడు. కడు పేదరికాన్ని అనుభవిస్తూనే చదు వును కొనసాగించిన నరేందర్.. తెలంగాణలోని మొక్కల వైవిధ్యం, పరిరక్షణపై పీహెచ్‌డీ చేసి, ఉస్మానియా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో డాక్టరేట్‌ను అందుకు న్నాడు.
వెంకంపాడు గ్రామానికి చెందిన మైసయ్య, ఇద్దమ్మ దంపతులకు పదిమంది సంతానం. అందులో చిన్న కుమారుడు తప్పెట్ల నరేందర్. చిన్నప్పటి నుంచి చదువుపై ఆసక్తి చూపేవాడు. నరేందర్ సోదరుల్లో ఒకరు వెంకన్న సుతారి మేస్త్రిగా పనిచేస్తుండ గా, మరో సోదరుడు దేవేంద ర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నరేందర్ నాలుగో తరగతి చదువుతుండగా తండ్రి, తొ మ్మిదో తరగతి చదువుతుండగా తల్లి మరణించడంతో ఇద్దరు సోదరులు, నలుగురు అక్కల స హకారంతో పాటు స్వయంకృషితో విద్యను కొ నసాగించాడు.
ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు వెంకంపాడు ప్రాథమిక పాఠశాలలో, ఆరవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు సీతారాంపురం బంగ్లా ఉన్నత పాఠశాలలో, 8 నుంచి 10వ తరగతి వరకు జడ్పీహెచ్‌ఎస్ నరసింహులపేటలో పూర్తి చేశాడు. సూర్యాపేటలో ఇంటర్, పాల్వంచలో డిగ్రీ పూర్తిచేసి వనపర్తిలో పీజీ, ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్ డీ పూర్తి చేశాడు. ఒకటో తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు నరేందర్ విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ హాస్టళ్లలోనే గడిచింది. అంతే కాకుండా పీహెచ్‌డీ పరి శోధన సమయంలో ఖర్చుల కోసం హోటల్‌లో పనిచేసేవాడు.
తెలంగాణ ఉద్యమంపై పలు జాతీయ, అంతర్జాతీయ సదస్సులో పాల్గొని పరిశోధన పత్రాలు సమర్పించారు. ఇటీవల ఓయూ 84వ స్నాతకోత్సవం సందర్భంగా తాను వృక్షశాస్త్రం శాఖలో ‘తెలంగాణ రాష్ట్రంలోని పవిత్ర వనాల లో మొక్కల వైవిధ్యం, పరిరక్షణ, పద్ధతులు ఆధ్యయనాలు’ అనే అంశంపై సహాయ ఆచార్యులు డాక్టర్ వెంకటరమణ పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు డాక్టరేట్ పట్టాను పొందాడు. ఇస్రో చై ర్మన్ డాక్టర్ నారాయణ, వీసీ కుమార్ చేతుల మీదుగా పట్టాను అందుకున్నాడు. నరేందర్ ప్ర స్తుతం ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా డు. నరేందర్‌ను గ్రామస్థులు, దళిత నాయకులు అభినందించారు.
బానోత్ ప్రవీణ్ కుమార్, మరిపెడ, విజయక్రాంతి