calender_icon.png 24 August, 2025 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇలాగైతే సీటు సినగడం ఖాయం!

24-08-2025 01:15:15 AM

అధికారమనే కుర్చీలో కూర్చున్నోడికి కిందఉండే ప్రజలు కానరారు. వారి బాధలు, కష్టాలు, సమస్యలు అస్సలు కనిపించవు. అది తెలుసుకునేలోపు జనం వారిని కుర్చీల్లోంచి దింపేస్తారు. అదే జనం సమస్యలు తెలుసుకొని పరిష్కరించినవారికి మళ్లీ పట్టం కడతారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి చాపకింద నీరులా క్రమక్రమంగా పెరుగుతోంది. ధర్నాచౌక్ మళ్లీ దద్దరిల్లుతోంది.

నిరసనలు, ఆందోళనలు, దీక్షలతో కళకళలాడుతోంది. వివిధ వర్గాల ప్రజలు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఇందిరాపార్క్ వద్ద ధర్నాచౌక్‌లో టెంట్‌లు వేసుకొని వరుసగా ధర్నాలు చేయడం షురువైంది. నిరసన గళాలు మళ్లీ ఏకమవుతున్నాయి. ఇది కాస్తా ఎక్కువైతే.. ప్రస్తుతం అధికారంలో ఉన్నవారి సీటు సినగడం ఖాయమనే చర్చ ప్రజల్లో జరుగుతోంది. అయితే ఇదంతా ఎత్తులో కూర్చున్న వాళ్లకు కనబడదు.. అర్థమవదు. కానీ జనాల సమస్యలు అర్థం చేసుకొని వాటిని పరిష్కరిస్తే అందలం ఎక్కిస్తారు. లేదంటే ఇక అధోగతే!      

 రమేశ్ మోతె