calender_icon.png 20 September, 2025 | 3:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్లపై సీఎం కీలక సమావేశం

20-09-2025 11:15:10 AM

హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శనివారం సాయంత్రం 5 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం రేవంత్ కీలక భేటీ కానున్నారు. సీఎం అధ్యక్షతన కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఈ సమీక్ష సమావేశం కొనసాగనుంది. తెలంగాణ హైకోర్టు గడువు దగ్గర పడుతున్న సమయంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం న్యాయ నిపుణులను కూడా పిలిచింది. సమీక్షా సమావేశానికి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు హాజరుకానున్నారు.  స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 30, 2025 గడువును విధించింది. దీనికి ప్రతిస్పందనగా, ఈ ఎన్నికలలో బీసీలకు 42శాతం(BC reservations) రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర మంత్రివర్గం జూలై 2025లో ఆర్డినెన్స్ జారీ చేసింది. తెలంగాణ సర్కార్ ఇటీవల తీసుకున్న చర్యలు వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్లను గణనీయంగా ప్రభావితం చేశాయి. ముఖ్యంగా విద్య, ఉపాధి, స్థానిక సంస్థల ఎన్నికలలో కోటాను 29శాతం నుండి 42శాతానికి పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.