calender_icon.png 5 September, 2025 | 6:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్‌రెడ్డి బీసీల బాంధవుడు

01-09-2025 01:30:02 AM

పీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేశ్ 

హైదరాబాద్, ఆగస్టు 31 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీసీలకు బాంధవుడుగా నిలిచారని, బీసీ ప్రజల తరఫున ఆయనకు ధన్య వాదాలు చెబుతున్నట్టు పీసీసీ అధికార ప్రతినిధి కొనగాల మహేశ్ పేర్కొన్నారు.

42 శాతం రిజర్వేషన్ల కోసం 50 శాతం పరిమితిని ఎత్తివేస్తూ క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోవడం, అసెం బ్లీలో చట్టం చేయడంతో బీసీలపై ఉన్న చిత్తశుద్ధిని నిరూపిస్తోం దన్నారు. బీసీలకు రాజ్యాధికారం అం దించాలన్న రాహుల్‌గాంధీ ఆలోచనను సీఎం రేవంత్‌రెడ్డి తూచా తప్పకుండా అమ లు చేస్తున్నారని తెలిపారు.