calender_icon.png 5 September, 2025 | 8:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలు ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయి

01-09-2025 01:28:16 AM

-తైక్వాండో హైదరాబాద్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణ

ముషీరాబాద్, ఆగస్టు 31(విజయక్రాంతి) : క్రీడలు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కల్పిస్తాయని తైక్వాండో  హైదరాబాద్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణ అన్నారు. ఆదివారం తైక్వాండో సాయిరక్ష అకాడమీ ఆధ్వర్యంలో ముషీరాబాద్ పద్మారావు నగర్ లో జరిగిన తైక్వాండో  బెల్టు టెస్టింగ్ పోటీలో ఉత్తీర్ణులైన క్రీడాకారులకు సర్టిఫికెట్లు, మెడల్స్ ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది.

ముఖ్యఅతిథిగా హాజరైన కృష్ణ మాట్లాడుతూ... విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అన్నారు. విద్యా, ఉద్యోగ రంగాలలో క్రీడాకారులకు రిజర్వేషన్లు సైతం ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో సాయిరక్ష అకాడమి అధ్యక్షుడు ఎన్ స్వామి, తైక్వాండో కోచ్ లు వెంకటేషం, పర్వత్ కుమార్, సంజయ్, లక్ష్మినారాయణ, రాకేష్ కుమార్, జయేంద్రా, వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.