23-10-2025 06:56:14 PM
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు..
సుల్తానాబాద్ (విజయక్రాంతి): రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని, కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు, గురువారం సుల్తానాబాద్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ... సన్నవడ్లకు బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గతంలో సన్నవడ్లకు ఎప్పుడు కూడా బోనస్ ఇవ్వని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మాజీ మంత్రులు ప్రస్తుతం రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు.
రైతుల సంక్షేమాన్ని పట్టని బిజెపి, బీఆర్ఎస్ పార్టీలకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. పంటల మార్పిడి వల్ల సారవంతమైన భూములు తయారు అవుతాయని ఎమ్మెల్యే చెప్పారు. రైతులు పంటల మార్పిడిపై దృష్టి సారించాలని కోరారు. ఐకెపి సెంటర్ లో ఉన్న చోట్ల కూడా పిఎసిఎస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వేణు, డిసిఒ శ్రీమలా, డిఎం శ్రీకాంత్, డిఎంఓ ప్రవీణ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, మాజీ మార్కెట్ చైర్మన్ సాయిరీ మహేందర్, నాయకులు పన్నాల రాములు, బిరుదు కృష్ణ, కల్లేపల్లి జానీ, ఉస్తేం గణేష్, చిలుక సతీష్, తోరికొండ ప్రభాకర్, ముత్యాల రవీందర్, పడాల అజయ్ గౌడ్, అమ్మిరీశెట్టి రాజలింగం, సింగిల్ విండో సీఈఓ బూర్గు సంతోష్, పలువురు జిల్లా అధికారులు, మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.