23-10-2025 07:04:36 PM
నిర్మల్ రూరల్: టీజీ ఆర్టీసీ ద్వారా యాత్ర ఆనందం సర్వీస్లో భాగంగా ఈనెల 27న అయోధ్య వచ్చే నెల 6న అయోధ్య కాశి 7న తిరుపతి కాణిపాకం అరుణాచలంకు ప్రత్యేక ఆర్టీసీ సర్వీసు నడుపుతున్నట్లు డిఎం పండరి, ఆర్టీసీ ప్రచార అధికారి రమణ తెలిపారు. అయోధ్యకు 6400 అరుణాచలానికి 6300 చార్జి ఉంటుందని భక్తులు ఆన్లైన్లో టికెట్లు రిజర్వేషన్ చేసుకోవాలని సూచించారు. యాత్రానందం సర్వీస్ లో భాగంగా ఈ ప్రత్యేక పశువులు నడుపుతున్నామని ఇతర వివరాలకు 99592 26003, నంబర్లు సంప్రదించాలని లేదా ఆర్టీసీ అధికారులు సంప్రదించవచ్చని సూచించారు.
అలాగే నిర్మల్ డిపో నుంచి హైదరాబాదులోని మియాపూర్ కు సూపర్ లగ్జరీ సర్వీసులు శుక్రవారం నుంచి ప్రారంభిస్తున్నటు నిర్మల్ డిఎం తెలిపారు. ఉదయం 11 గంటలకు 15 నిమిషాలకు నిర్మల్ నుంచి బయలుదేరి సాయంత్రం నాలుగు గంటల 15 నిమిషాలకు మియాపూర్ కు చేరుకుంటుందన్నారు. అక్కడినుండి ఏడు గంటలకు బయలుదేరి నిర్మల్ కు ఒంటిగంట పది నిమిషాలకు చేరుకుంటుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.