calender_icon.png 2 October, 2025 | 8:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు స్వగ్రామానికి సీఎం రేవంత్‌రెడ్డి

02-10-2025 01:11:15 AM

  1. కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో కలిసి కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకలు
  2. ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం తన స్వగ్రామం నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో కలిసి దసరా ఉత్సవాల్లో పాల్గొననున్నారు. అందుకు అధికార యంత్రాంగం భద్రత ఏర్పాట్లను సిద్ధం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో ఎన్నికల నియమావళికి లోబడి అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు.

జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామానికి రెండోసారి ముఖ్యమంత్రి హోదాలో రానున్నారు.