02-10-2025 01:07:15 AM
సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ సంతాపం
సూర్యాపేట, అక్టోబర్ 1 (విజయక్రాంతి): మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి (73) బుధవారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలం గా అనా రోగ్యంతో బాధపడతున్న దామోదర్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందారు. ఈ నెల నాలుగో తేదీ సాయంత్రం సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో దామోదర్‌రెడ్డి అంత్యక్రియలు జరగనున్నట్టు సమాచారం.
ప్రస్తుతం దామోదర్‌రెడ్డి కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. కాగా దామోదర్‌రెడ్డి మృతి పట్ల సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షు డు మహేశ్‌కుమార్ సంతాపం తెలిపారు. దామోదర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దామోదర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని, ఆయన లేకపోవడం కాంగ్రెస్‌కు తీరని లోటు అని అన్నారు.
దామోదర్‌రెడ్డి 14 సెప్టెంబర్ 1952న లింగాల గ్రామం, ఖమ్మం జిల్లాలో జన్మించారు. ఉన్నత కుటుంబంలో పుట్టిన ఆయన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి 1985లో జరిగిన ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి గెలిచారు. తదుపరి 1989లో జరిగిన ఎన్నిక ల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో ఆయన స్వతం త్ర అభ్యర్థిగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు.
1999లో ఓటమిపాలైన ఆయన 2004, 2009 లో సూర్యాపేట అసెంబ్లీ నుంచి తిరిగి గెలుపొందారు. 2014, 2018 లోనూ ఓటమి పాలయ్యారు. చివరగా 2023 శాసనసభ ఎన్నికల్లో సూర్యాపేట నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 4,605 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. మొత్తంగా ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఐటీ శాఖ మం త్రిగా పనిచేశారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధిలో తన వంతు పాత్రను పోషించారు. ఆయన మృతి ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులలో విషాదాన్ని నింపింది. టైగర్ దామన్నగా కాంగ్రెస్ నాయకులు పిలుచుకునే దామోదర్‌రెడ్డి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా పనిచేశారు.