calender_icon.png 29 May, 2025 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

28-05-2025 01:19:59 AM

ఎమ్మెల్యే పద్మావతి

కోదడం, మే 26: పేదప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం సహాయ నిధి, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.

కోదాడ, అనంతగిరి మండలాల్లోని 157 మందికి మంజూరైన రూ.50.43 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను బాధితులకు అందజేశారు. 24 మందికి మంజూరైన రూ.24.02 లక్షల విలువైన కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఎర్నేని వెంకటరత్నం బాబు, సామినేని ప్రమీల, వరప్రసాద్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సీతారాంరెడ్డి, తూమాటి నాగిరెడ్డి, సుందరి వెంకటేశ్వర్లు, బాల్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.