calender_icon.png 29 May, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనుగోళ్లను వేగవంతం చేసి మిల్లులకు తరలించాలి

28-05-2025 01:21:58 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ 

 జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),మే27: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లను వేగవంతం చేసి వెంటనే మిల్లులకు తరలించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు.

మంగళవారం జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలోని ఐకేపీ కేంద్రాన్ని మరియు తిమ్మాపురం-1 లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని,కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు పంపేందుకు లారీలను సర్దుబాటు చేసి కేంద్రాలకు పంపుతామని అన్నారు.కాంటావేసిన బస్తాలను ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు సూచించారు.

అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని,ఎక్కువ మంది హమాలీలను ఏర్పాటు చేసుకొని వెంటనే ధాన్యాన్ని లారీలకు లోడ్ చేయాలన్నారు. ఈయన వెంట సివిల్ సప్లై కార్పొరేషన్ డీఎం ప్రసాద్, తహశీల్దార్ చిప్పలపల్లి యాదగిరి, ఎంపీడీఓ గోపి, కేంద్రాల నిర్వాహకులు,రైతులు తదితరులు ఉన్నారు.