05-12-2025 12:00:00 AM
ఓయూ బోధన, బోధనేతర ఉద్యోగుల జేఏసీ
ముషీరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): ఈనెల 7న ఉస్మానియా విశ్వవిద్యా లయం (ఓయూ)కి వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సమస్యలపై దృష్టి సారించాలని ఓయూ బోధన, బోధనేతర ఉద్యో గుల జేఏసీ కోరింది. పలు సమస్యలపై జేఏసీగా ఏర్పడ్డ అధ్యాపకులు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ ప్రతినిధులు ప్రొఫెసర్ మనోహర్, ప్రొఫెసర్ సురేందర్ రెడ్డి, డాక్టర్ పరుశురాం, డాక్టర్ ధర్మతేజలు మాట్లాడారు.
ఈ సందర్బంగా మనోహర్ మాట్లాడుతూ తమ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నప్పటికీ అధికారులు, ముఖ్యంగా వీసీ పెడచెవిన పెడుతున్నారని జేఏసీ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఔట్ సోర్సింగ్, పార్ట్ టైమ్, కాంట్రాక్టు విభాగాల్లో సుమారు ఒక్కొక్కరు 20 నుంచి 25 సంవత్సరాలు పని చేస్తున్నారని వెల్లడించారు. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, రెగ్యులర్ చేయాలని, కంట్రి బ్యూషన్ పెన్షన్ పథకం తదితర డిమాండ్లు పరిష్కరించాలని కోరారు.
పని ఒత్తిడి అధికంగా ఉందని తక్షణమే ఉద్యోగ నియామ కాలు చేపట్టాలన్నారు. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా అన్ని సౌకర్యాలు తమకు కల్పించాలని అన్నారు. అన్ని సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి 7న విశ్వవిద్యాలయం వస్తున్న నేపథ్యంలో తమకు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 5న సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతూ ఆరట్స్ కాలేజ్ నుండి ఎన్ సీసీ గేట్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు విఠల్, వెంకయ్య, వెంకటేష్, ఖాదర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.