calender_icon.png 5 December, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షిలోహు మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు

05-12-2025 12:00:00 AM

  1. మూడు లక్షల 82 వేల విలువ గల నూతన 

వస్త్రాలు ఆర్థిక సాయం అందజేత

బూర్గంపాడు,డిసెంబర్4,(విజయక్రాంతి):హైదరాబాద్ కు చెందిన షిలోహు మిషనరీ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సారపాకలోగల సీయోను ప్రేయర్ హౌస్ మందిరంలో గురువారం గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు భక్తి ప్రవక్తలతో నిర్వహించారు. షిలోహు మిషనరీ మినిస్ట్రీస్ వ్యవ స్థాపకులు పాస్టర్ మోజెస్ ములక ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా బూర్గంపాడు, భద్రాచలం, అశ్వా పురం, కరకగూడెం,పినపాక, ఆంధ్రాలోని ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు, అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్.పురం, కూనవరం, రంప చోడవరం, మారేడుమిల్లి మండలాలు ఒరిస్సా, తమిళనాడు రాష్ట్రాల కు చెందిన 150 మంది పాస్టర్లకు క్రిస్మస్ పండుగ సందర్భంగా రూ. 3.82 లక్షల విలువగలిగిన నూతన వస్త్రాలు,ఆర్థిక సాయం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జరిగిన ప్రార్ధన కూడికల్లో షిలోహు మిషనరీ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ మోజెస్ ములక మాట్లాడుతూ క్రీస్తు చూపిన ప్రేమను ప్రజలందరికీ పంచాలని ఆయన అన్నారు.యేసు పంచిన ప్రేమ ప్రపం చానికి ఆదర్శమని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా ప్రత్యేక గీతాలను ఆలపించారు. ప్రత్యేక ప్రార్థనలను చేశారు. మిఠాయిలు పంచిపెట్టారు.

ఈ ప్రార్ధన సమావేశానికి స్థానిక సంఘ కాపరి పాస్టర్ డి. పెద్దారావు అధ్యక్షత వహించారు.ఈ కార్యక్ర మంలో షిలోహు మిషనరీ మినిస్ట్రీస్ బృందం రజని మోజస్ అమ్మ, పాస్టర్ సైమన్, బ్రదర్ మోతుకూరి చరణ్, బ్రదర్ స్టీవ్ ఏలియట్ ములక,బ్రదర్ ఇమ్మానుయేల్ ఆయా మండలాల కో- ఆర్డినేటర్లు డి. పెద్దారావు, యాకోబు, టి.ఎ మ్. కుమార్, పాల్, జయ ప్రకాష్,జోనతాన్, స్టెఫెన్ బాబు తదితరులు పాల్గొన్నారు.