04-09-2025 12:56:09 AM
70 ఏళ్ల వృద్ధుడికి మైక్లిప్ శస్త్రచికిత్స
ముషీరాబాద్, సెప్టెంబర్ 03 (విజయ క్రాంతి) : తెలుగు రాష్ట్రాల్లో భారత దేశపు మొట్ట మొదటి మేక్ ఇన్ ఇండియా మైట్రల్ క్లిప్(మైక్లిప్) శస్త్రచికిత్సను తీవ్రమైన మైట్రల్ రిగర్జిటేషన్(ఎంఆర్)తో బాధ పడుతున్న 70 ఏళ్ల వృద్దుడికి విజయవంతంగా నిర్వహించినట్లు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాల జిస్ట్ డా.ఎం.సాయి సుధాకర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆయన మా ట్లాడుతూ ఇప్పటివరకు కేవలం అమెరికాలో తయారైన మైట్రల్ క్లిప్స్ మాత్రమే భారత దేశంలో లభ్యమయ్యేవని, కానీ అవి అధిక ఖర్చుతో ఉండటంతో, చాలా మందికి అం దుబాటులో ఉండేవి కావన్నారు. ఈ ఏడాది జూన్‌లో భారత దేశానికి చెందిన మెరిల్ సంస్థ తక్కువ ఖర్చుతో దేశీయంగా అభివృద్ధి చేసిన మైక్లిప్ పరికరాన్ని నియంత్రణ అనుమతులు పొందిన తర్వాత ప్రారంభించిందని తెలిపారు.