calender_icon.png 2 May, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదో తరగతి ఫలితాల్లో ‘సీఎంఆర్’ విజయ ఢంకా

02-05-2025 01:07:11 AM

హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): పదో తరగతి ఫలితాల్లో బోయినపల్లి సీఎంఆర్ హైస్కూల్ విద్యార్థులు 99 శాతం ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బీవీఎన్‌ఎస్ ఐశ్వర్య 572 మార్కులు, మెట్టు ఆశ్రితకుమార్ 572,పీ చరిత్ 571, డీ సాయి అచ్యుత 570, మహమ్మద్ ఆరిఫుకుద్దిన్ 568, ఏ నాగసాయి హిమేష్ 568, ఆర్ ప్రణయ్‌కుమార్ 563, జంపాల దినకరన్ 562, సైదా జునేరా ఫాతిమా 561, సుమయ్యా సుల్తానా 554, సైడ్ హది 548, మంగిలిపెల్లి కావ్య 546, సాల్వేర్ లాస్య ప్రియ 544, కార్ప్ సూరజ్ 541, మనీష్ 541, నసీమ తస్లీమా 540, సూర్య శ్రీకర్ మద్దాలి తిరుమల 540 అత్యుత్తమ మార్కులు సాధించారు.

మొత్తం 137 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 99 శాతం ఉత్తీర్ణతతో పాటు, 96 శాతం విద్యార్థులు 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించి సీఎంఆర్ హైస్కూల్ ఖ్యాతిని మండల స్థాయిలో నిరూపించారు. ఈ సందర్భంగా విద్యాలయాల అధిపతి సీహెచ్ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.

ప్రణాళికబద్ధమైన పర్యవేక్షణ, అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయ బృందం, ప్రత్యేక తరగతుల నిర్వహణ, సమయానికి అనుకూలంగా విద్యార్థులకు తగిన విధంగా మోటివేషన్ కల్పించడం ద్వారా మంచి ఫలితాలు సాధించామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు.  అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను విద్యాలయాల అధిపతి గోపాల్‌రెడ్డి, డైరెక్టర్ ఎస్‌కేరెడ్డి ఘనంగా సన్మానించారు.