02-05-2025 01:07:07 AM
బీఆర్‌ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
కుత్బుల్లాపూర్, మే 01(విజయ క్రాంతి): దేశాభివృద్ధికి కార్మికులే పట్టుకొమ్మలని బిఆర్‌ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ అన్నారు.మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి డి.పోచంపల్లిలోని ఆల్కలీ మెటల్స్ యూనిట్-2 నందు బిఆర్‌ఎస్ కార్మిక విభాగం అధ్వర్యంలో నిర్వహించిన కార్మిక దినోత్సవ వేడుకలకు బిఆర్‌ఎస్ పార్టీ విప్, బిఆర్‌ఎస్ కార్మిక విభాగం సలహాదారులు, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై కార్మిక జెండాను ఎగురవేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మికులు లేని అభివృద్ధి శూన్యమని, దేశ నిర్మాణంలో ప్రతీ కార్మికుడి కష్టం, చెమట చుక్కలు ఉన్నాయని అన్నారు.
కార్మికుల ద్వారానే దేశ ప్రగతి సాధ్యమని తెలిపారు.అనంతరం కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో-ఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, మాజీ గ్రంధాలయ చైర్మన్ నాగరాజు యాదవ్, బిఆర్‌ఎస్ కార్మిక విభాగం అధ్యక్షులు మల్లేష్ ముదిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్దిక్, ప్రధాన కార్యదర్శి బాల్ రాజ్, కార్మికులు వేణు తదితరులు పాల్గొన్నారు.