02-05-2025 01:07:15 AM
పటాన్ చెరు/జిన్నారం/గుమ్మడిదల, మే 1 : పటాన్ చెరు నియోజకవర్గంలోని పారిశ్రామిక వాడల్లో గురువారం మే డే వేడుకల ను కార్మికులు ఘనంగా నిర్వహించారు. పటాన్ చెరు మండల పరిధిలోని పాశమైలా రం, ఇస్నాపూర్, చిట్కుల్, జిన్నారం మండల పరిధిలోని ఐడీఏ బొల్లారం, ఖాజీపల్లి, గడ్డపోతారం, గుమ్మడిదల మండల పరిధిలోని బొంతపల్లి, దోమడుగు తదితర ప్రాం తాలలో కార్మికులు మే డే సందర్భంగా కార్మిక జెండాలనుఆవిష్కరించారు.
కోహీర్, మే 1:ప్రపంచ కార్మిక దినోత్స వం మే డే ఉత్సవాలను గురువారం ఘనం గా జరుపుకొన్నారు. మండల పరిధిలోని ఫిరమల్ ఫార్మా లిమిటెడ్ కర్మాగారంలో ని ర్వహించిన కార్యక్రమంలో కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి నర్సయ్య జండాను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసి డెంట్ మానిక్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ సంజీవ రెడ్డి, ప్రభు, కార్య నిర్వహణ కార్యదర్శులు బాగన్న, అజిమొద్దీన్, నిజాముద్దీన్, కోశాధికారి నర్సింహులు, సభ్యులు అశోక్, జహు రుద్దీన్, జి నర్సింలుపాల్గొన్నారు.