17-09-2025 01:28:58 AM
అలంపూర్, సెప్టెంబర్ 16:పేదలకు సీఎంఆర్‌ఎఫ్ పథకం ఒక వరమని ఎమ్మెల్యే విజయుడు అన్నారు.మంగళవారం బాధితులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే విజయుడు చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని ఆయా గ్రామాలకు చెందిన 109 మంది బాధితులకు రూ.24,35,500 విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి దిశ గా నడిపిస్తానని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతినిత్యం గ్రామాల్లో పర్యటించి వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు వావిలాల రంగారెడ్డి, నాగేశ్వర్ రెడ్డి,కిషోర్ రఘు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.