calender_icon.png 17 September, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాపాలన వేడుకలకు ముఖ్యఅతిథిగా మంత్రి వాకిటి శ్రీహరి

17-09-2025 01:27:20 AM

నారాయణపేట.సెప్టెంబర్, 16(విజయక్రాంతి) : తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం పురస్కరించుకొని నారాయణపేట జిల్లా కలెక్టరేట్ లో  ఈ నెల 17 న ఉదయం 10 గంటలకు నిర్వహించే జాతీయ జండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, క్రీడలు యువజన సర్వీసులు మరియు మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరిహాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు.

మంగళ వారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వేడుకల నిర్వహణలో ఎవరికి ఇచ్చిన బాధ్యతలను వారు సక్రమంగా చేయాలని ఈ సందర్భంగా ఆమె లైన్ డిపార్ట్ మెంట్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, కలెక్టరేట్ ఏవో జయసుధ, ఆర్డీఓ రామచంద్రనాయక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, అధికారులు పాల్గొన్నారు.