calender_icon.png 9 July, 2025 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమయపాలన పాటించని సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం

09-07-2025 12:31:13 AM

బోథ్, జూలై 8 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బోథ్ ప్రభుత్వ సివిల్ ఆసుపత్రి ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆకస్మికంగా తని ఖీ చేశారు. మండల పర్యటనలో భాగంగా మంగళవారం ఆస్పత్తితో పాటు రెసిడెన్షియల్ కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా ఆసుపత్రి లోని పలు రికార్డులు పరిశీలించారు. సిబ్బంది సమయ పాలన పాటించక పోవడంపై   ఆగ్రహం వ్యక్తం చేశా రు.

నిర్మాణంలో ఉన్న 100 పడకల ఆసుపత్రి భవనాన్ని పరిశీలించి, సదరు గుత్తేద రుతో మాట్లాడి తొందరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆసుప త్రి లోని రోగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. అనంతరం ల్యాబ్ ను సందర్శించి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, సమయ పాలన పాటించాలని మూడు షిఫ్ట్ లుగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.

నూతన ల్యాబ్, బ్లడ్ బ్యాంకు, ఇతర సౌకర్యాలు కల్పన కోసం రూ. 7కోట్ల నిధులు కేటాయించామని, వాటికి త్వరలోనే టెండర్‌లు పిలుస్తామని అన్నారు. అనంత రం ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలను కలెక్టర్ సందర్శించారు. వనమోత్సవంలో భాగంగా కళాశాల ఆవరణలో అధికారులు, నాయకులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసిన ప్రిన్సిపల్, కళాశాల సిబ్బందిని అభినందించారు.

ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సలోని, బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోడ్డు గంగారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్ల రాజు యాదవ్, తహసిల్దార్ సుభాష్ చందర్, మండల అభివృద్ధి అధికారి రమేష్, వ్యవసా య విస్తారణ అధికారి రవితేజ, ఎఫ్.ఆర్.వో ప్రణయ్, ఐకెపి ఎపిఎం మాధవ్, కాంగ్రెస్ నేతలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.