calender_icon.png 9 July, 2025 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

38 కిలోల గంజాయి పట్టివేత

09-07-2025 12:31:48 AM

  1. నలుగురు నిందితుల అరెస్టు 
  2. వివరాలు వెల్లడించిన ఏసీపీ రమణ గౌడ్ 

చేవెళ్ల / శంకర్ పల్లి, జులై 8: గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను మొకిలా పోలీస్ స్టేషన్ సిబ్బంది , రాజేంద్రనగర్ జోన్ ఎస్ ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం సాయంత్రం నార్సింగి ఏసీపీ రమణ గౌడ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రంలోని గంజం జిల్లాకు చెందిన దశరథి ప్రధాన్ అలియాస్ దాసు, సిబరం నహక్, నిలు మండల్ , సాగర్ సాస్మల్ అక్రమ మార్గంలో ఈజీగా డబ్బులు సంపాదించాలని అనుకున్నారు.

ఇందుకో సం వారి రాష్ట్రంలోని గంజాయి సరఫరాదారుల నుంచి కొనుగోలు చేసి, హైదరాబాద్ నగర శి వార్లలో గల కార్మిక ప్రాంతాల్లో విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అక్కడి నుంచి గంజాయిని తీసుకొచ్చి ప్యాకెట్ల రూపంలో నిల్వ చేసుకొని రవాణా చేస్తున్నారు.

మంగళవారం సమాచారం అందుకున్న పోలీసులు మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని కొల్లూరు గేట్ సమీపంలోని బృందావనం గార్డెన్స్ వద్ద వారిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 38 కిలోల గంజాయి, 5 మొబైల్ ఫోన్లు, రూ. 2 వేలు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా నేరం ఒప్పుకోవడంతో ఎన్ డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని, కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలిస్తామనిఏసీపీతెలిపారు.