19-05-2025 12:00:00 AM
శ్రీ గౌరీ నీలకంటేశ్వర స్వామి కల్యాణోత్సవం, గ్రామ దేవతల ఉత్సవాలలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
సిద్దిపేట, మే 18 (విజయక్రాంతి): సిద్దిపేట పట్టణంలోని శ్రీ గౌరీ నిలకంఠ దేవాలయంలో జరిగిన 34 వ వార్షికోత్సవం సందర్బంగా జరిగిన కళ్యానోత్సవం, సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూరు నారాయణరావుపేట సిద్దిపేట రూరల్ మండలాలలోని పలు గ్రామాలలో జరిగిన గ్రామ దేవతల ఉత్సవాలలో ఆదివారం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని ఆయా గ్రామాలలో మాట్లాడారు.
చదువు లేకపోతే జీవితానికి అర్థం లేదని సూచించారు నీలకంఠ సమాజం ఆధ్వర్యంలో ప్రతిభ చాటిన విద్యార్థులను ప్రోత్సహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలందరి ఐక్యతతో దేవాలయాకలను అభివృద్ధి చేసుకున్నట్లు తెలిపారు. నిలకంఠ సమాజం ఎంతో ఆదర్శం గా నిలుస్తుందన్నారు. కర్రతో చేసిన రథం అద్భుతంగా ఉందన్నారు.. రథం గురించి ఏర్పాటు చేసిన భవనం ప్రారంభించు కోవడం సంతోషమన్నారు.
పదవ తరగతి, ఇంటర్ లో ఉత్తమ ప్రతిభ కనభరిచిన విద్యార్థులును అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. విద్యను ప్రోత్సహించడం అనేది మంచి కార్యక్రమన్నారు. విద్య, ఉద్యోగం కోసమే కాదు దేశం పట్ల, సమాజం పట్ల మన బాధ్యతను పెంచుతుందన్నారు. చదువులేకపోతే జీవితానికి అర్థం లేదు సూచించారు.. సాయంత్రం జరిగే రథోత్సవం సందర్బంగా రథాన్ని అద్భుతంగా తయారు చేసిన శిల్పిని సన్మానం చేశారు.
నీకు నేను ఉన్న నర్సింహులు..
సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ బరిగేల నర్సింహులు శనివారం రాత్రి తీవ్ర అనారోగ్యానికి గురై సిద్దిపేట పట్టణంలోని పీపుల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నర్సింహాలును హరీష్ రావు పరామర్శించీ, నేను ఉన్న నర్సింహులు డౌంట్ వర్రీ అంటూ ఆత్మీయంగ పలకరించారు.
అధైర్య పడొద్దని అండగ ఉంటానని, తన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెల్సుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇచ్చారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.