calender_icon.png 23 December, 2025 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెంటాకుర్దులో ఎరువుల గోడౌన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

23-12-2025 12:00:00 AM

నిజామాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి) : బోధన్ మండలం మావందిఖుర్దు గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎరువుల పంపిణీ గోడౌన్ ను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గిడ్డంగిలో నిలువ ఉన్న ఎరువులను పరిశీలించారు. స్టాక్ బోర్డుపై ప్రదర్శించిన వివరాలకు అనుగుణంగా నిల్వలు ఉన్నాయా అని గమనించారు. యాసంగి సీజన్ లో ఎంత మొత్తంలో యూరియా ఎరువు అవసరం పడుతుందని ఆరా తీశారు.

స్టాక్ కొంత మిగిలి ఉండగానే, ఇండెంట్ పెట్టి కొత్త స్టాక్ తెప్పించుకోవాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ప్రైవేట్ డీలర్లు కూడా నిబంధనలను పాటిస్తూ, ఎరువుల విక్రయాలు జరిపేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రస్తుత ఖరీఫ్ తరహాలోనే యాసంగి సీజన్ కు సంబంధించి కూడా ఎరువుల కొరత తలెత్తకుండా రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా ఇప్పటి నుండే ప్రణాళికాబద్దంగా వ్యవహరించాలని అన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా ఎరువుల పంపిణీ జరగాలని సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు.