24-11-2025 12:00:00 AM
నిజామాబాద్, నవంబర్ 23 :(విజయ క్రాంతి): ‘గేట్‘ అర్హత పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన జి.శ్రీచందనను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అభినందించారు. భీమ్గల్ మండలం జాగిర్యాల్ గ్రామానికి చెందిన జి. దేవేందర్, స్రవంతి దంపతుల కుమార్తె అయిన శ్రీచందన గేట్ ప్రవేశ పరీక్షలో 81.67శాతం మార్కులతో 302 ర్యాంకు సాధించింది.
ఈ సందర్భంగా శనివారం ఆమెను సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అభినందించారు. ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతగా ప్రిపేర్ అయి, తొలి ప్రయత్నంలోనే మంచి ర్యాంకు సాధించడం అభినందనీయమని అన్నారు. ఇదే పట్టుదలను కనబరుస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు.