calender_icon.png 2 May, 2025 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కలెక్టర్ సన్మానం

02-05-2025 01:23:20 AM

మునిపల్లి, మే 1 : పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఘనంగా గురువారం సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా  జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కంకోల్ నుండి  గడ్డం వర్షిత  590 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచింది.

అనంతరం  జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి మాట్లాడుతూ విద్యార్థులను భవిష్యత్తులో ఏమవుతారని అడగగా వారు ఇంజనీర్ అవుతారని తెలియజేశారు. తాను కూడా ఐఐటి విద్యార్థినేనని, మీరు కూడా బాగా చదివి ఐఏఎస్ కావాలని సూచించారు. రాష్ట్రస్థాయిలో  జిల్లా రెండో స్థానాన్ని పొందడం హర్షనీయమని జిల్లా విద్యాధికారులను అభినందించారు.

కంకోల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తుకారాం, ఉపాధ్యాయులను అభినందించారు. ఈ కార్యక్రమంలో  డిసిసిబి సెక్రెటరీ లింభాజీ, జిల్లా విద్యాశాఖ ఏడీ శంకర్, పరీక్షల అధికారి పండరి నాయక్,  పాఠశాల ఉపాధ్యాయులు,  తల్లిదండ్రులుపాల్గొన్నారు