calender_icon.png 2 May, 2025 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనంతసాగర్‌లో పహల్గాం మృతులకు నివాళి

02-05-2025 01:21:32 AM

కొండాపూర్, మే 1 : పహాల్గాంలో పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన మారణ హోమాన్ని నిరసిస్తూ అనంతసాగర్ లో తాజా మాజీ ఉప సర్పంచ్ ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో కుల మాతాలకు అతీతంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించి మృతులకు నివాళి ఆర్పించారు. ఈ సందర్భంగా ఇంద్రారెడ్డి  మాట్లాడుతూ పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడి హేయమైంద న్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.