calender_icon.png 2 September, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశానికి ప్రమాదం పొంచి ఉందని ముందే చెప్పిన సురవరం

02-09-2025 12:18:16 AM

  1. సీపీఐ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి 

స్వగ్రామంలో సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ

పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ 

అలంపూర్ ,సెప్టెంబర్ 1:ఇవాళ దేశంలో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే నాడు సీపీఐ అగ్ర నేత రాజనీతి పరిజ్ఞానుడు,ఆలోచన విధానం కలిగిన నేత మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి చెప్పిన మాటలు అక్షర సత్యం అయ్యే పరిస్థితులు స్పష్టమవుతున్నాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యు లు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి అన్నా రు.సోమవారం గద్వాల జిల్లా ఉండవల్లి మండలం కంచుపాడు గ్రామంలో సురవ రం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు.

కుటుంబ సభ్యులు,సీపీఐ పార్టీ రాష్ట్ర నాయకులు బాల నరసింహ అధ్యక్షతన ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేశారు.మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ తో పాటు ఆయన హాజరయ్యారు. ముందుగా వారు సురవరం చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో వెంకట్ రెడ్డి మాట్లాడుతూ...దేశంలో మతోన్మాద నియంతృత్వ ,ఫాసిస్టు పరిపాలన సాగబోతున్నదని ప్రమాదం అంచుల్లో ప్రజాస్వామ్యం దేశం ఉంటుందని జాగ్రత్తపడాలని ఆనాడే ఊహించి గొప్ప వ్యక్తి సురవ రం సుధాకర్ రెడ్డి అని కొనియాడారు.

ఆ యన భూస్వామి కుటుంబంలో పుట్టి వి ద్యార్థి దశ నుంచే పోరుబాట పట్టారని గుర్తు చేశారు.మంచిని ప్రేమించుమన్నా మానవత్వం నిలుపుమన్న ఆశయంతోనే ముందు కు సాగారన్నారు.దేశానికి ప్రమాదం పొంచి ఉందని వామపక్షాలు ఒకే వేదిక మీదకు రావాలని చెప్పిన నేత సురవరం అని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని లౌకిక వ్యవస్థను నిలబెట్టుకోవాలని ,

కుల మతాలకు అతీతంగా భాషాభావాలకు సాంస్కృతిక ప్రాంతీయ భేదాలకు అన్నిటికీ అతీతంగా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పరితపించేవారని తెలిపారు.జాతీయ నాయకత్వంతో ఉన్న అనుబంధంతో ప్రత్యేక తెలం గాణ కొరకు ప్రధాన చొరవ తీసుకున్న  వ్యక్తి సుధాకర్ రెడ్డి అన్న సంగతి గుర్తు చేశారు. సురవరం ఆశయాలు ముందుకు తీసుకు పోవాలంటే తప్పకుండా అందరూ ఆయన ఆలోచన విధానాన్ని పంచుకోవాలన్నారు.

సురవరం కోరికను తీర్చిన రాష్ట్ర ప్రభుత్వం 

సురవరం సుధాకర్ రెడ్డి స్వగ్రామమైన కంచుపాడు అభివృద్ధికి సంబంధించి అండ గా నిలవాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపా రు. ఆయన కోరిక మేరకు రూ.3 కోట్ల రూ పాయలతో జాతీయ రహదారి వరకు రోడ్డు నిర్మాణం,కోటి రూపాయలతో ప్రభు త్వ పా ఠశాలల అదనపు గదుల ఏర్పాటు, గ్రామం లో అర్హులైన నిరుపేదలకు 5 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ప్రొసీ డింగ్ కాపీలు , జీవోలు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ సభలో ప్రభుత్వం తరఫున అందజేసి చివరి కోరికను తీర్చినట్లు తెలిపా రు.

రాష్ట్ర ప్రభుత్వం స్వర్గీయ సురవరం సు ధాకర్ రెడ్డి పేరుమీద సముచిత స్థానం క ల్పించే దిశగా ముందుకు పోతుందని తెలిపారు సురవరం కుటుంబ సభ్యులు విజయ మ్మ,నికిల్,కపిల్,సీపీఐ రాష్ట్ర నాయకులు బాల నర్సింలు, పల్లె నరసింహ, జిల్లా నాయకులు ఆంజనేయులు వెంకటస్వామి, ఇటిక్యా లపాడు మాజీ సర్పంచ్ సురవరం లోకేశ్వర్ రెడ్డి, శేషన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.