17-09-2025 02:07:00 AM
ఇల్లంతకుంట, సెప్టెంబర్ 16(విజయక్రాంతి):రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగాపూర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యం కోసం వచ్చే రోగులకు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించద్దని, వార్డులు, సిబ్బంది హాజరు వివరాలు ఫార్మసీ తదితర అంశాలపై ఆరా తీశారు.
వైద్య సేవల తీరుపై ఆసుపత్రికి వచ్చిన రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్దలింగాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మధ్యాహ్న భోజన సమయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం గ్యాస్ స్టౌలపై మాత్రమే చేయాలని, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం సిద్ధం చేయాలనిసూచించారు.