calender_icon.png 27 September, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించాలి

26-09-2025 11:27:59 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు, జిల్లా సంక్షేమ అధికారి ఆడెపు భాస్కర్ లతో కలిసి అన్ని శాఖల అధికారులతో బతుకమ్మ పండుగ సంబరాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన ఆవరణలో బతుకమ్మ పండుగ వేడుకలను నిర్వహించాలని తెలిపారు.

ఈ వేడుకలలో కలెక్టరేట్ లో విధులు నిర్వహిస్తున్న మహిళ అధికారులు, ఉద్యోగులు, మహిళా సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. మున్సిపాలిటీలలో బతుకమ్మ సంబరాలపై హోర్డింగ్ లు ఏర్పాటు చేయాలని, బతుకమ్మ ముగింపు రోజు అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని తెలిపారు. బతుకమ్మ ఆడే ప్రదేశాలు, నిమజ్జనం చేసే చెరువులు, వాగుల వద్ద పారిశుధ్యం పనులు చేపట్టి వెలుతురు ఉండేలా విద్యుత్ దీపాలు ఏర్పాట్లు చేయాలని, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.