02-01-2026 12:21:39 AM
కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రంభీం ఆసిఫాబాద్, జనవరి ౧ (విజయక్రాంతి): ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య జర్నలిస్టులు వారధిలా పని చేస్తారని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. నూతన సం వత్సరాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా పౌర సంబంధాల అధికారి వై. సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడి యా పాత్రికేయులు మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మీడియా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి లాగా పనిచేస్తుందని, ప్రభుత్వం ప్రవేశపెట్టి సంక్షేమ అభివృద్ధి పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించ డంలో, సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి తెలియపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో సమగ్రంగా విచారించి వాస్తవాలను అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని, తద్వారా ప్రజా సమస్యలు పరిష్కరిం చబడతాయని తెలిపారు. ఈ సందర్భంగా పాత్రికేయులకు జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో నూతన సంవత్సర డైరీలను అం దజేశారు.
అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్.పి. నితికపంత్‌ను మర్యాదపూ ర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్, తెలంగాణ తహసిల్దార్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో సమీకృత కలెక్టరేట్ భవ న సముదాయంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, ఎం. డేవిడ్, కాగజ్‌నగర్ సబ్‌కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారిలోకేశ్వర్ రావులను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ తహసిల్దార్ అసోసియేషన్ జిల్లా శాఖ డైరీ, కాల సూచికలను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమాలలో తహసిల్దార్ అసోసియేషన్ సంఘం జిల్లా అధ్యక్షులు మోహన్ రావు, కార్యదర్శి రహీముద్దీన్, తహసిల్దార్లు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికే యులు పాల్గొన్నారు.