calender_icon.png 27 July, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ గా రాధాకృష్ణ కొనసాగింపు

26-07-2025 03:40:12 PM

మేడ్చల్ అర్బన్: మేడ్చల్ పట్టణంలోని శ్రీ దాక్షాయణి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త, చైర్మన్ గా దాత్రిక రాధాకృష్ణను కొనసాగిస్తూ ఎండోమెంట్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. 2023లో దేవాదాయ శాఖ ఉత్తర్వుల ప్రకారం దాత్రిక రాధాకృష్ణను ఆలయ ధర్మకర్త, చైర్మన్ గా కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో శనివారం ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ ప్రణీత్, ఆలయ ఈవో  కృష్ణమాచార్యులు మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ ద్రాక్షాయని సమేత రామలింగేశ్వర దేవస్థాన ధర్మకర్తగా, చైర్మన్ గా దాత్రిక రాధాకృష్ణ కొనసాగుతారని వారు వెల్లడించారు. ఆలయానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ దాత్రిక రాధాకృష్ణ ఆధ్వర్యంలో కొనసాగుతాయని తెలిపారు.