calender_icon.png 1 July, 2025 | 6:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం కాలేజీల బంద్

01-07-2025 12:30:50 AM

- విజయవంతం చేయాలని పీడీఎస్ యూ జిల్లా కమిటీ పిలుపు

చేవెళ్ల, జూన్ 30: పెండింగ్ ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ విడుదల చేయాలని చేపట్టిన 72 గంటల కాలేజీల బంద్ ను విజయవంతం చేయాలని పీడీఎస్ యూ జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. సోమవారం చేవెళ్ల వివేకానంద డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పట్నం శ్రీనివాస్ , ప్రధాన కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ .. రాష్ట్రంలో 7,200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ , స్కాలర్ షిప్స్ పెండింగ్లో ఉన్నాయన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ర్పడి 18 నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దీంతో యూనివర్సిటీల్లో చే రేందుకు ఎంట్రెన్స్ రాసి ర్యాంకులు సంపాదించినా సర్టిఫికెట్లు తమ దగ్గర లేకపోవడంతో ఉన్నత విద్యకు దూరమవుతున్నారని వాపోయారు. జూలై 2,3,4 తేదీల్లో కాలేజీల బంద్ ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, కళాశాల విద్యార్థులుపాల్గొన్నారు.