calender_icon.png 1 July, 2025 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొగత జలపాతానికి మాత్రమే ప్రభుత్వ అనుమతి

01-07-2025 12:28:56 AM

ఏఎస్‌పి శివం ఉపాధ్యాయ

వాజేడు, జూన్ 30 (విజయ క్రాంతి): ములుగు జిల్లాల అటవీ ప్రాంతంలో వెలసినటువంటి జలపాతాలలో వాజేడు మండలం చీకుపల్లి గ్రామంలో వెలిసిన బొగత జలపాతం కు మాత్రమే ప్రభుత్వ అనుమతి కలదని ఎటూర్ నాగారం ఏ ఎస్ పి శివమ ఉపాధ్యాయ సోమవారం పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.

పర్యటకులు బొగత జలపాతంకు మాత్రమే సందర్శిస్తూ లోతు తక్కువగా ఉన్న ఈతకొలనులో మాత్రమే స్నానాలు చేయాలని, అధికారుల అనుమతి లేకుండా ప్రవాహ ప్రాంతాలకు వెళ్లరాదని సూచించారు. లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లి మృత్యువు బారిన పడిన సంఘటనలు గతంలో నెలకొన్నాయని పేర్కొన్నారు.

జిల్లాలో మిగతా జలపాతాలైన కొంగాల, మహితాపురం, ముత్యం దార జలపాతాలకు ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేవని తెలియజేశారు. ఎట్టి పరిస్థితుల్లో నిషేధిత జలపాతాలకు వెళ్లరాదని హెచ్చరించారు.