23-10-2025 12:59:33 AM
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు ఆహ్వానం అందజేసిన టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం
హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాం తి): డిసెంబర్ 19, 20 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల జాతీయ సదస్సుకు హాజరుకావాలని భారత ఉపరాష్ట్రతి సీపీ రాధాకృష్ణన్‌ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం కలిసి ఆహ్వానం పలికారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగ నియామక ప్రక్రియలో ప్రవేశపెట్టిన పలు సంస్కరణల గురించి ఉపరాష్ర్టపతికి ఆయన వివరించారు.