23-10-2025 07:09:06 PM
లయన్స్ ఆధ్వర్యంలో రోగులకు అల్పాహారం..
నకిరేకల్ (విజయక్రాంతి): అభాగ్యులకు అండగా లయన్స్ క్లబ్ ఉంటూ పేదల ఆకలిని తీర్చడం అభినందనీయమని లయన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు కందాల పాపిరెడ్డి పేర్కొన్నారు. గురువారం నకిరేకల్, శాలిగౌరారం, కట్టంగూరు లయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో క్లబ్ జోన్ చైర్మన్ బుడిగే శ్రీనివాసులు కుమారుడు కార్తీక్ జన్మదినోత్సవ సందర్బంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అల్పాహారం పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు రేపాల సతీష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పన్నాల రాఘవరెడ్డి, డీసీలు ఎన్ రామ్మోహన్ రావు, ఎర్ర శంభు లింగారెడ్డి, యల్లపు రెడ్డి యాదగిరిరెడ్డి, డెంకల సత్యనారాయణ, సెంటినియల్ క్లబ్ అధ్యక్షుడు కందాల ప్రేమ్నాథ్ రెడ్డి, నవ్య క్లబ్ అధ్యక్షురాలు రమాదేవి, ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ కోఆర్డినేటర్ వుప్పల సంతోష్ కుమార్, క్లబ్ కార్యదర్శి సూర్యచంద్రరావు, కోశాధికారి అండె వెంకన్న, శేఖర్ శెట్టి, శివకోటి ఆంజనేయులు గుప్తా పాల్గొన్నారు.