25-10-2025 12:01:36 AM
నటుడు నారా రోహిత్ శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. సీఎం నివాసంలో ఆయనను కలిసిన రోహిత్.. అక్టోబర్ 30న జరగనున్న తన వివాహ వేడుకకు ఆహ్వానిస్తూ, పెళ్లిపత్రిక అందించారు. రోహిత్ వివాహం వచ్చే గురువారం రాత్రి 10.35 గంటలకు హైదరాబాద్‌లో జరగనుంది.
అంతకుముందు నాలుగు రోజుల ముందే పెళ్లి సందడి ప్రారంభం కానుంది. ఈ నెల 25న హల్దీ వేడుకతో పెళ్లి ఘడియలు ఆరంభమవుతాయి. 26న పెళ్లికొడుకును చేస్తారు. 28న మెహందీ వేడుక ఉంటుంది.